"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

నియమాలు మరియు నిబంధనలు

వస్త్రధారణ:

  • విద్యార్దులు మంచి వస్త్రధారణ పాటించాలి.
  • ఆడవారు సల్వార్ కమీజ్, చుడిదార్, ఒణి ధరించాలి.
  • మగవారు ఫ్యాంట్ షర్ట్, బెల్టు, షూస్ ధరించి professional గ ఉండాలి.
  • జీన్స్, టీ షర్ట్స్, నిషేధం.
  • కేవలం స్టూడెంట్స్ శుక్రవారం సాధారణ దుస్తులు ధరించడానికి అనుమతి ఉంటాయి.

క్రమశిక్షణ:

  • ప్రతి విద్యార్ధి campus లో identity card కలిగి ఉండాలి.
  • ఒక తరగతి లోని విద్యార్ధి ఇంకో తరగతి లోకి ప్రవేశించడం నిషేధం.
  • తరగతి గదిలో, లైబ్రరీ లో, లేబరెటరీలలో నిశబ్దం పాటించవలెను.
  • కాలేజీ ప్రాంగణములో గోడల పై, మెట్ల పైన కుర్చోరాదు.
  • గోడలపై, బెంచీలపై వ్రాయడం నిషేధం.
  • కాలేజీ ఆస్తులను పాడుచేయడం గానీ, లైబ్రరీ, lab లలో వస్తువులను, పుస్తకాలను పాడుచేయడం, చింపడం చేయకూడదు. అట్లా చేసిన వారి నుండి పూర్తి రుసుము వసూలు చేయబడును.
  • కాలేజీ మన అందరిది. అందరూ జాతీయ భావం కలిగి ఉండవలెను. కాలేజీ లో సినిమా, కుల, మత చర్చలు జరపడం, రాజకీయ చర్చలు జరపడం పూర్తిగా నిషేధం.
  • తోటి వారందరిని గౌరవించాలి. ఒకరి మనసు నొప్పించడం, కించ పరచడం, తగువులు రేపడం, అగౌరవపరచడం చేయరాదు.
  • ప్రతి ముఖ్యమైన విషయము కూడా నోటీసు బోర్డులో పొందు పరచడం జరుగుతుంది. అట్టి నోటీసులను గమనించవలెను. నోటీసు చూడకపోవడంతో కాలేజీ కి భాద్యత లేదు.
  • కాలేజీ కి బైక్ ల పై వచ్చే విధ్యార్దులందరికీ డ్రైవింగ్ లైసెన్స్ లు, హెల్మెట్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లో నిధానం, జాగ్రత్త పాటించాలి అని కోరుతున్నాము.
  • క్లాసు జరుగుతున్న సమయంలో తరగతి లోకి ప్రవేశించడం, తరగతి నుండి బయటకు వెళ్ళడానికి lecturer permission తీసుకోవాలి.
  • తరగతులు జరుగు సమయంలో కాకుండా, ఎప్పుడైనా విద్యార్దులు principal ని కలవ వచ్చును.
  • కాలేజి లో సెల్ ఫోను నిషేధం.
  • కాలేజీలో విద్యార్ధులకు జరుగు continuous meeting లకు తప్పకుండా హాజరు కావలెను. పూర్తి నిశబ్దం పాటించాలి.
  • కాలేజీ కి విలువైన వస్తువులు, నగదు, electronic పరికరాలు తీసుకు రాకూడదు. అవి పోయినచో యాజమాన్యానికి బాధ్యత లేదు.
  • పరిక్షలకు హాజరుకావడానికి, ప్రతి విద్యార్ధి కి 75% attendence కావలెను.
  • ప్రతి క్లాసుకి హాజరు నమోదు చేయబడుతుంది.
  • క్లాసు కి ఆలస్యంగా వచ్చేవారిని అనుమతించబడదు.
  • కాలేజీ కి హాజరు కానీ వారు, మరుసటి రోజు leave letter తీసుకు రావలెను.
  • వరుసగా ౩ రోజులు రాని వారు medical certificate లేదా తల్లిదండ్రులను తీసుకురావలేను.
  • క్రమశిక్షణ రాహిత్యంలో కాలేజీ కి హాజరుకానివారి పై Action తీసుకోవడం జరుగుతుంది.

ర్యాగింగ్:

  • కాలేజీలో, కాలేజీ ఆవరణంలో, బస్సులలో, ఇతరత్ర ప్రదేశాలలో ర్యాగింగ్ చేయడం పూర్తి నిషేధం. అది చట్టరిత్యా నేరం.
  • ర్యాగింగ్ లో పాల్గొనే వారి పై action తీసుకోబడును. అట్టి వారిని కాలేజీ నుండి తొలిగించడం జరుగుతుంది.

ర్యాగింగ్ అంటే:

ర్యాగింగ్ అంటే ఏడిపించడం, హేళన చేయడం, తిట్టడం, కొట్టడం, హాని చెయ్యడం, శారీరకంగా, మానసికంగా హింసించడం, తోటి వారి ఇష్టం లేకుండా వారిని పాడమనడం, డాన్స్ చేయమనడం, అభ్యoతరకరంగా ప్రవర్తించడం, వారికి ఇష్టం లేని పని చేయమనడం.

ర్యాగింగ్ నిషేధిత కమిటీ:

అట్టి వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోబడును. ర్యాగింగ్ తీవ్రతను బట్టి, అట్టి వారి నుండి పెనాల్టీ కట్టించుకోవడం, కాలేజీ నుండి సస్పెండ్ చెయ్యడం, కాలేజీ నుండి తొలిగించడం జరుగును.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.

Name :
E-mail :
Phone :
Message :