"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

చైర్మన్ సందేశం

ముందుగా మా కళాశాలలో పాలిటెక్నిక్ కోర్సును ఎంచుకున్న విద్యార్దినీ విద్యార్ధులందరికీ నా అభినందనలు. తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దటానికి, వారి బంగారు భవిష్యత్తును Technical విద్య ద్వారా బాటలు వేసిన తల్లిదండ్రులందరకి నా కృతజ్ఞాతాభినందనలు. ఎందుకంటే, Technical విద్యా అనేది, ఈ మానవ జీవన శైలిని మేరుగు పరచి, జీవన ప్రయాణన్ని సుఖమయం చేసే ఒక వాహనం లాంటిది. రోజు రోజుకి మారుతున్న ప్రపంచంతో పోటీపడే నైపుణ్యాన్ని, Technical విద్య ద్వారా నే మన యువతరం సొంతం చేసుకోగలరు.

ఎక్కడో దూరపు ప్రదేశాలలో ఉన్న మన వారిని కలుసుకోవడాని, సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి, మన నిత్య జీవన విధానాన్ని సులభతరం, సుఖవంతం చేసుకోడానికి, ఈ రోజు ముందు ఉన్న రైళ్ళు, మెట్రో రైళ్ళు, విమానాలు, Computer, సెల్ ఫోన్లు , internet ఇతరాత్ర పరికరాలు అన్ని కూడా ఈ technical విద్య ద్వారా నే మనకు అందుబాటులో కి వచ్చినవి. Technical విద్యను అభ్యసించిన వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. పరిశ్రమలకు అనుగుణంగా, విద్యార్ధులు నైపుణ్యాన్ని పెంపొందించడానికి, తమ పిల్లలు పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగం చెయ్యాలి అని కోరుకునే తల్లితండ్రులు కోరికను నేరవేర్చడానికి, ప్రతి గ్రామీన యువతరం పట్టణ యువతరంతో సమానంగా అవకాశాలు పొందటానికి, గ్రామీన యువతరం కలలను సాకారం చేయడానికి, గ్రామీన విద్యార్ధులకు ప్రపంచ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి, పరిశ్రమలు, కంపేనీలు కోరే విధంగా, విద్యార్ధులను తీర్చిదిద్దటానికి, ఈ దివిసీమ పోలిటెక్నిక్ కళాశాల నిరంతరం శ్రమిస్తుంది. వెనుక పడిన ప్రతి విద్యార్ధికి అర్ధం అయ్యేరీతిలో మా అధ్యాపకులు కొత్త విధానాలను అనుసరిస్తూ, ప్రతి అధ్యాపకుడు, నిరంతర విద్యార్ధిలా, వారి నైపుణ్యాన్ని పెంచుకుంటూ, విద్య ప్రమాణాలను పెంచుతూ ఈ దేశానికి ఉపయోగపడే విధంగా ప్రతి విద్యార్దిని తీర్చిదిద్దటం జరుగుతుంది.

మా అధ్యాపకులు పాటిస్తున్న కొత్త విద్యా విధానాలు మరియు ప్రణాళికల ఫలితమే మా విద్యార్దులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ ర్యాంక్ లు మరియు ఉన్నత కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు రావడం. క్రమశిక్షణ, వ్యక్తిత్వం లేని విద్యా నైపుణ్యం వ్యర్ధం. అలాంటి మేడిపండ్లకు మేము ఎప్పుడు వ్యతిరేకమే. అందుకనే, విద్యతో పాటు మా విద్యార్దులకు క్రమశిక్షణ, వ్యక్తిత్వం, దేశ భక్తి, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించే మంచి పౌరులుగా తీర్చి దిద్దటానికి వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది.

                ప్రతి విధ్యార్ది తమ తమ ప్రతిభలను, నైపుణ్యాలను ప్రదర్శించడానికి, పెంపొందించడానికి, మా కళాశాల వారికి మంచి అవకాశాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తుంది. ప్రతి విద్యార్దిని/విధ్యార్ధులను నిష్ణాతులుగా తీర్చిదిద్దటానికి మా అధ్యాపకులు మంచి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. విద్య ఒక హక్కు. ప్రతి పేద విద్యార్ధి చదువుకోవాలి అనే సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వo fee Reimbursement లతో ఉచిత  విద్య , స్కాలర్ షిప్ లు అందించడం ఒక వరం. ఈ ఆవకాశాన్ని  వినియోగించుకుని ప్రతి విధ్యార్ది చదువుకుని ఉన్నతంగా జీవించాలి. వారికి మేము ఎప్పుడు చేయూత నివ్వడం జరుగుతుంది.

ప్రతి విద్యార్ధి, వారి తల్లిదండ్రుల కలలను నిజం చేసే విధంగా ముందుకు సాగుదాం. దేశ నిర్మాణంలో భాగస్వాములం అవుదాం.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :